అయ్యా... ముఖ్యమంత్రి గారు... మా గోడు వినండయ్య...

గ్రామీణ వైద్యులు గ్రామాల్లో పట్టణాల్లో మురికివాడల్లో సామాన్య నిరుపేద ప్రజలకు అడివి లో కొండ కోనల్లో కాలినడకన ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్న సంగతి మీకు తెలిసిన విషయమే స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణ కొరకు రూపొందించిన జీవో నెంబర్ 429 కమ్యూనిటీ పారామెడికల్ ఆర్ఎంపీ పి.ఎం.పి కోసం అని ముఖ్యమంత్రివర్యులు ఇచ్చినారు. 



ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించి మధ్యలో ఆగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే గ్రామీణ వైద్యుల చీకటి బతుకుల్లో వెలుగు నింపాలని చాలి చాలని సంపాదనతో వేల కుటుంబాల్లో లక్షల మంది బ్రతుకుతున్న మా సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరుచున్నాము. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రివర్యులు గతంలో 465 జీవో ఇచ్చి ఉన్నారు. గ్రామీణ వైద్యుల జీవనం వృత్తి భద్రత లేఖ రక్షణ లేని జీవన విధానాన్ని గడుపుతున్న మాకు మీ ద్వారా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. అదికారులు రాజకీయ నాయకులు వున్నా తరతరాలుగా గ్రామీణ వైద్యుల సమస్యలను ఏ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేదు, మా సమస్యలను జన వాణి కార్యక్రమంలో మరియు పాదయాత్ర సమయంలో కూటమి నాయకులకు మీరు ఉన్న ప్రాంతాలలో గ్రామీణ వైద్యులు మీ దగ్గరికి వచ్చి మా సమస్యలను వివరించాము ప్రభుత్వం గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలి అని ప్రభుత్వంలో అవకాశం కల్పించాలని అన్ని గ్రామీణ వైద్యులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నాము ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. గ్రామీణ వైద్యులకు ఇచ్చిన హామీని నెర వేరుస్తారని నిలిచిపోయిన ట్రైనింగ్ క్లాసుల ను పున ప్రారంభించాలని ప్రభుత్వాలలో అవకాశం కల్పించాలని గ్రామీణ వైద్యులకు తగిన అవకాశం కల్పించి ప్రభుత్వంలో ఏర్పాటు చేయు 104 /108 మరియు వైద్య శాఖలో అవకాశం కల్పించాలని గ్రామీణ వైద్యులకు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్రంలో ఉన్న గ్రామీణ సభ్యులందరూ తరుపున ప్రభుత్వాన్ని వేడు కుంటున్నాము గ్రామీణ వైద్యులు ఆకలి చావులు తో అప్పుల ఊబిలో కి వెళుతున్నారు. చాలిచాలనీ సంపాదన తో కుటుంబ పోషణ కూడ కష్టం గా ఉంది కొందరు కూలీకి వెళ్లి పొట్ట నింపుకుంటున్నారు.  కొందరు గ్రామాలలో పట్టణాలలో చోట నాయకులు, అదికారులు దాడులు చేస్తు బెదిరిస్తున్నారు. వృత్తి భద్రత లేఖ సమస్యల వలయంలో బాధతొ జివనం సాగిస్తూ ప్రజలకు ప్రథమ చికిత్స చేస్తు జీవనం సాగిస్తున్నరు. గ్రామీణ వైద్యుల కు ఉచితంగా ఇల్లు/ ముద్ర లోను ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకోవాలి, మీ సహాయ సహకారాలు అందివ్వాలని మా సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుకుంటూ మీ విధేయులు మీ కొండి శెట్టి సురేష్ బాబు అధ్యక్షులు జాతీయ ఆర్ ఎం పీ పీ ఎంపీ సంఘాల సమైక్య విజయవాడ.