ఎస్ ఐ సైదులు ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు

సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి- గుండాల మండల ఎస్ ఐ సైదులు



హోళీ పండుగ సందర్భంగా గుండాల మండల ఎస్ ఐ సైదులు ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఉత్సవం జరుపుకునేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువత ఆదర్శంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళవద్దని, సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరం అని ఆయన తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవం జరుపుకోవాలని, సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దని కోరారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని, ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లోద్దని సూచించారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.