ఎస్సీ వర్గీకరణ ప్రకారమే -ఉద్యోగాలు భర్తీ చేయాలి

ఎస్సీ వర్గీకరణ ప్రకారమే -ఉద్యోగాలు భర్తీ చేయాలి...జిల్లా ఎస్సీ /ఎస్టీ మెడికల్ &హెల్త్ ఎంప్లాయిస్ జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ డిమాండ్.



తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జాబ్ క్యాలండర్ ప్రకారము భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ /ఎస్టీ మెడికల్ &హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ కేటగిరి లోని ఉద్యోగాలన్నీ ఏకపక్షంగా మాలలకే చెందే అవకాశం ఉందని ఆయన అన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం లో ఉన్న న్యాయం ను సుప్రీమ్ కోర్ట్ గుర్తించి సంచలనమైన తీర్పు చెప్పిందని ఆయన తన సంతోషం ను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు తగిన న్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టం ను అమలులోకి తీసుకొని రావాలని ఆయన డిమాండ్ చేశారు.



విద్య, ఉద్యోగరంగాలలో ఎస్సి లకు న్యాయం చేయడం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా 30 సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాటం చేసింది ఒక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం ఆర్ పి ఎస్) మాత్రమేనని ఆయన కొనియాడారు. ప్రస్తుతం ఈ పోరాటం విజయం దేశంలో ఒకే ఒక వ్యక్తి కి చెందుతుందని ఆయనే మందకృష్ణ మాదిగ అని, మందకృష్ణ మాదిగ వ్యక్తి కాదని ఆయన ఒక శక్తి అని ఆయన చేసిన 30ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ, ఎస్టీ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జయప్రకాశ్ అన్నారు. 



తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ను ప్రవేశ పెట్టి, ఎస్సీ వర్గీకరణ కు ఆమోదం తెలిపినందుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా కు, మంత్రిలకు, మిగతా శాసనసభ్యులుకు అందరికి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ, ఎస్టీ మెడికల్ &హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ కృతజ్ఞతలు తెలియజేశారు.