అల్లవరం ఎస్సై గా తిరుమలరావు బాధ్యతలు స్వీకరణ.
అల్లవరం: అల్లవరం మండలం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా తిరుమలరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై హరిష్ కుమార్ వి ఆర్ లోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుమలరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతానని అన్నారు. కొడుపందాలు, పేకాటలు, అక్రమ మద్యం తరలింపు పై తన ద్రుష్టి కి తీసుకురావాలని కోరారు. ఎస్సై ని పలువురు కలిసి అభినందనలు తెలియజేసారు.