శాంతి సామరస్యాలు సేవ త్యాగం వితరణ అనే సుగుణాలు వెల్లి విరిసే పరిమళాల పూతోటరంజాన్ రంజాన్...ముస్లిం సోదరులకు అతిపెద్ద పండుగ రంజాన్...ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించిన నెల.ముస్లిం సోదరులకు అతిపెద్ద పండుగను ఈద్-ఉల్-ఫితల్ అని కూడా అంటారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. రంజాన్ అంటే క్షమాపణ కోరడానికి మరో అవకాశం. విధేయతతో కూడిన పనులు చేసే నెలయే రంజాన్. జీవితం ఎంత కష్టతరమైనప్పటికీ రంజాన్ దానిని మార్చగలదని విశ్వసిస్తారు ముస్లింలు. క్రమ శిక్షణ, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం.. ఉపవాసం అన్న పదానికి అర్థమే“దేవునికి దగ్గరగా నివసించుట” అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే రోజులో కొంత సమయం వరకు అన్న పానీయాలు సైతం మానుకుని ప్రత్యేక ప్రార్ధనలతో సహా నిజ దైవాన్ని ఆరాధించుకుంటూ, దైవానికి భయపడుతూ మనస్సులలో సహజంగా కలిగే చెడు ఆలోచనలను, చెడు చూపులను, చెడు మాటలను, ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలను అదుపు చేసుకుంటూ ఉండే దీక్షా సమయం.
రంజాన్ ఉపవాసం: నిజానికి అలాంటి ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు మనస్సులలో భక్తి భావం కూడా పొంగి పొర్లుతూ ఉంటుంది. ఖురాన్ ప్రకారం సృష్టికర్త అయిన దేవుడు విశ్వాసులపై ఉపవాసం విధి చెయ్యటానికి కారణమే వారిలో భయభక్తులు జనింపజేయటం. అయితే ఉపవాస దినాలలో మనస్సులలో భక్తిభావం పొంగి పొర్లిపోతున్నప్పుడు భావావేశంతో.. “ఈ రోజు నుండి ఫలానా చెడులకు దూరంగా ఉంటామనో, బీదసాదల పట్ల, అవసరార్థులకు అండగా ఉంటామనో, ఇతరుల పట్ల ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండమనో, ఈర్ష్య చెందమనో, ద్వేషం కలిగి ఉండమనో, చెడుగా ఆలోచించమనో, దేవుని పట్ల భక్తి భావం కలిగి ఉంటామనో గట్టి నిర్ణయాలు తీసేసుకోవటం, ఒక ప్రక్క ప్రపంచంలో సృష్టికర్త అయిన దేవుడు మనిషి కోరికలకు తగ్గట్టు సకల ఏర్పాట్లూ చేసి … మరో ప్రక్క మనిషికి మంచీ-చెడులలో వేటినైనా ఎన్నుకునే స్వేచ్ఛ ను ఇచ్చాడు. అలా ఎందుకంటే ప్రపంచంలో ప్రతీ విశ్వాసీ ఒక ‘ఉపవాసి’ మాదిరిగా జీవితం గడుపుతాడా? లేదా? అన్నదే దేవుడు మనిషికి పెట్టిన పరీక్ష. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ వారు “ఉపవాస స్థితిలో ఉండగా ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే.. నేను ఉపవాసంలో ఉన్నాను అని చెప్పండి” అని చెబుతారు. కాబట్టి ఓ విశ్వాసి ఉపవాసిగా జీవితం గడపటం అంటే కేవలం ఉదరంలో ఆహార, పానీయాలు దిగకుండా జాగ్రత్త పడటమే కాదు…ఇతరుల పట్ల ప్రతికూలంగా ఆలోచించకపోవటం ఉపవాసం…ఇతరులను దూషించకపోవటం ఉపవాసం…ఇతరుల పట్ల చెడు ఆలోచించకపోవటం ఉపవాసం…ఇతరుల పట్ల ఈర్ష్య ద్వేషాలు కలిగి ఉండకపోవటం ఉపవాసం...
దేవుడు విధించిన విధి-నిషేధాలను ఉల్లంఘించకపోవటం ఉపవాసం... తలిదండ్రుల, భార్యా పిల్లల, బీదసాదల అన్నార్తుల పేద రోగుల ఖైదీల శరణార్ధుల పై కనికరించే నెలయే రంజాన్ శ్రమజీవుల అంగవైకల్యుల హక్కులను చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడటం ఉపవాసంలో భాగమే నిజానికి ఈ రకమైన విలువలతో కూడిన జీవితం గడపటం అన్నది 30 రోజులు ఉపవాసం ఉన్నంత వరకే కాదు, ఆ 30 రోజుల తరువాత కూడా ఈ రకమైన విలువలతో జీవితం గడపగలగాలి. నిజానికి అది చాలా కష్టమైన పని!. కానీ ఆ కష్టాన్ని దాటుకుని ఈ రకమైన విలువలతో ఓ విశ్వాసి జీవితం గడపగలడా? లేదా? అన్నదే దైవం తరఫున పరీక్ష. ఆ పరీక్షలో ఉత్తేర్ణులు అవ్వటానికే ఓ నిరంతర సాధనలా ఒక నెలంతా రంజాన్ నెలలో ఉపవాసాలను నిర్దేశించటం జరిగింది. మొత్తానికి రమజాన్ ఉపవాసాల నెల అన్నది మనిషి పూర్తి జీవితాన్ని నైతికంగా నియంత్రించే శిక్షణా కాలం లాంటిది తప్పితే కేవలం పుణ్యాలు సంపాదించుకునే నెల మాత్రమే కాదు! కానీ రమజాన్ ఉపవాసాల నెలలో అలవర్చుకునే భక్తి భావాన్ని, ఉత్తమ ప్రవర్తనను మిగతా నెలల్లో కొనసాగించలేకపోతే మటుకు దైవం దృష్టిలో 30 రోజుల ఉపవాసాలకు విలువే ఉండదు. అలాంటి విలువలేని ఉపవాసాలు దైవం దృష్టిలో ఆకలి దప్పులుగా మాత్రమే పరిగణించబడతాయి. దైవప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ప్రవచించారు: స్వర్గంలో ఒక ద్వారం ఉంది. దాన్ని రయ్యాన్ అని అంటారు. ప్రళయదినాన ఉపవాస దీక్షకులు అందులో నుండి ప్రవేశిస్తారు. వారు తప్ప ఇంకెవ్వరూ అందులో ప్రవేశించలేరు. ఉపవాస దీక్షకులు ఎక్కడ? అని అనబడుతుంది. అప్పుడు వారు నిలబడతారు అందులో వారు తప్ప ఇంకెవ్వరూ ప్రవేశించారు. అందులో ఆఖరి వ్యక్తి చేరాక అది మూసి వేయబడుతుంది. ఇక దాని గుండా ఇంకెవ్వరూ చేరలేరు.
(సహీహ్ బుఖారీ :1896, ముస్లిం :1152) రంజాన్ నెలలో ఉపవాసం తో పాటు జకాతె అనే ఒక విధి నెరవేర్చడం ప్రతి ఆర్థిక స్థోమత ఉన్న ముస్లిం పై తన కు అల్లాహ్ ఇచ్చిన డబ్బు బంగారు ఇతర విలువైన ఆస్తులపై ప్రతి సంవత్సరం రెండు శాతంపైగా లెక్కించి ముస్లిం మత విద్వాంసులు ముఫ్తీ ఉలేమాలతో సంప్రదించి బీద బంధువులు పీడిత అవసరార్థులు రోగులు ఖైదీలు ఆశ్రయం కోల్పోయిన వారు పేద విద్యార్థులు శరణార్థులు తదితరులకు సహాయం చేసే ప్రక్రియనే జకాతె అంటారు ప్రతి సంవత్సరం భారతదేశంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ముస్లిం లు జకాతె అనే సొమ్ము తో దాన ధర్మాలు సామాజిక సేవలు పేదలను బాధితులను దగ్గరి బంధువులను పీడిత అణగారిన వారిని ఆదుకునే సహాయం సహకారం అంద చేస్తారు.
ఓ ఉదాహరణ...ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ అనే పాలకుడి పాలనలో ఆయన ఖజానాకు జకాతె సొమ్ము వస్తోంది వెంటనే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారు అధికారులను పిలిచి బైతుల్ మాల్ ద్వారా ఈ జకాతె సొమ్మును బీద వారిలో పంచండి అని అజ్ఞాపిస్తారు అధికారులు కొద్ది సేపటి తరువాత వెనుదిరిగి వచ్చి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారు తమరి పాలనలో ముస్లిం ప్రజానీకంలో జకాతె సొమ్మును పంచేశాము ఇక పేదవారు ఎవ్వరూ లేదు జకాతె సొమ్ము మిగిలింది అన్నారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారు సరే ఋణ గ్రస్తుల్లో పంచండి అని అజ్ఞాపిస్తారు కొద్ది సేపటికి బైతుల్ మాల్ అధికారులు వెనుదిరిగి వచ్చి మీ పాలనలో ఋణ గ్రస్తులకి అందజేషాము ఇంకనూ జకాతె సొమ్ము మిగిలి ఉంది అంటారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారు సరే విద్యా విజ్ఞానం కోసం ఖర్చు పెట్టండి అని అజ్ఞాపిస్తారు బైతుల్ మాల్ అధికారులు వెనుదిరిగి వచ్చి విద్యా విజ్ఞానం కోసం ఖర్చు పెట్టాము ఇంకా జకాతె సొమ్ము మిగిలింది అంటారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారు నా పాలనలో ఉన్న ముస్లిమేతర హిందూ సోదరుల అవసరాలను తీర్చండి అని అజ్ఞాపిస్తారు బైతుల్ మాల్ అధికారులు వెనుదిరిగి వచ్చి ముస్లిమేతర హిందూ సోదరుల అవసరాలను తీర్చేశాము ఖర్చు పెట్టాము ఇంకా జకాతె సొమ్ము మిగిలింది అన్నారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వారు అన్నారు రండి మిగిలిన జకాతె సొమ్ము తో గోధుమ బియ్యపు గింజలను తీసుకొని కొండలపై అడవులలో వెదజెల్లి పశు పక్షాదుల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తాము అన్నారు ఇస్లాం లో రంజాన్ నెలలో ఉపవాసాలతో పాటు ఉన్నత మైన నడవడిక జకాతె సొమ్ము తో పేద పీడితుల కు ఆదుకొని సహాయ సహకారాలు అందజేసి సృష్టిలోని ప్రతి జీవరాశికి కనికరించి దేశంలో జాతీయ సమైక్యతకు దేశ సుస్థిరత కు అల్లాహ్ కృపకు పాత్రులు మత సామరస్యం పరమత సహనం సోదర భావం వసుధైక కుటుంబీకుడిగా ఉంటూ అల్లాహ్ కారుణ్యానికి పాత్రుడిగా కావటమే రంజాన్ పరమార్థం అనంత కరుణామయుడు అపార కృపాషీలుడు అల్లాహ్ సృష్టిలోని ప్రతి మానవునికి సృష్టి లోని ప్రతి జీవిపై ప్రేమ కరుణ అనురాగం ఆప్యాయతతో పాటు సదాచరణ ను ఆచరించే సృష్టి కర్తను ఆరాధించే సద్గుణాలు ఇవ్వాలని ప్రార్థిస్తు...... వ్యాస కర్త సామాజిక సేవకుడు ..
మీ ఉమర్ ఫారూఖ్ ఖాన్