చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు

విజయవాడ నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు. 



ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి చంద్రన్న వజ్ర ఉత్సవ వేడుకలు సంయుక్తంగా పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుండి 20 వ తేదీ వరకు నాటికి పోటీలో సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జానపద నృత్య పోటీలు నిర్వహించి ఏప్రిల్ 20 వ తేదీ వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించు చున్నారు. పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఏ ఎమ్ రత్నం ప్రధాన కార్యదర్శి మోహన్ గౌడ సంయుక్తంగా కలిసి పిఎంకెఎం ఫైన్ ఆర్ట్స్ మరియు సిఫా అధ్యక్షులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో కనివిని ఎరుగని రీతిలో ఘనంగా కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో నాడు 2000 సంవత్సరంలో స్వర్ణోత్సవ వేడుకలు నేడు 2025 వజ్రోత్సవ వేడుకలు నిర్వహించు చున్న ఒకే ఒక్కడు సిని దర్శకులు పసుపులేటి  వెంకటరమణ అంటూ  ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో శ్రీమతి అమృత వర్షిణి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండి శెట్టి సురేష్ బాబు, అశోక్ కొప్పుల, బొర్రా నర్సయ్య, సయ్యద్ జాఫర్, డీ రామ్ బాబు, ఎన్ వి లక్ష్మీ దేవి, సీనియర్ ఆర్టిస్ట్ సీనియర్ జర్నలిస్టు ప్రజా నాట్య మందలి ఎన్ టి ఆర్ జిల్లా అధ్యక్షులు జి వి రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.