పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటాం

ఆదివాసి నిరుద్యోగ యువతకి అన్యాయం జరిగితే నూతనంగా నిర్మించే పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటాం

  


అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవిధి మండలం సిలేరు: ఇటీవల కాలంలో ఒక గిరిజనేత్రాలకి అక్రమ పద్ధతిలో ఉద్యోగంలో నియమకం చేయుటకు ఏపీ జెన్కో అధికారులు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు, కావున తక్షణమే ఆ యొక్క నియమకాన్ని రద్దుచేసి స్థానిక ఆదివాసి నిరుద్యోగులతో ఆ యొక్క కాంటాక్ట్ లేబర్ ఉద్యోగమును నియమకం  చేయాలని దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొర్రా మార్క్ రాజు మరియు దండకారణ్య విమోచన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లో మనోజ్ కుమార్ తెలిపారు.



సీలేరు మరియు చుట్టుపక్కన ఉన్న ఆదివాసి నిరుద్యోగ యువతకి అన్యాయం జరిగితే నూతనంగా నిర్మించే పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటామన అంతేకాకుండా ప్రస్తుత జెన్కో  ప్రాజెక్ట్ కార్యాలయంలో నిర్వధిక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుందని, అదేవిధంగా దశలవారీగా మా యొక్క పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు, కావున తక్షణమే ఆ యొక్క అక్రమ నిమకాన్ని రద్దు చేయాలని ఒకవేళ రద్దు చేయకపోతే మాత్రం జరిగే పరిణామాలకు ఏపీ జెన్కో అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు, ఈ కార్యక్రమంలో DLO సభ్యులు సిరుపతి, దేవా, చంద్రయ్య, బొజ్జ తదితరులు పాల్గొన్నారు.