అమాయకులపై ఉగ్రవాదుల కాల్పులు క్షమించరాని నేరం

పహల్గాంలోని కాల్పుల ఘటనపై తీవ్ర ఆవేదన... కాల్పుల్లో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి...సుద్దాల వేద పండితులు వేపా నర్శింహ మూర్తి..



జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనపై. సుద్దాల వేద పండితులు వేపా నర్శింహ మూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్షమించారని నేరమని ఆయన పేర్కొన్నారు.  అమాయక భారత పర్యటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే సైనికులు పట్టుకొని ప్రజలు చూస్తుండగానే బహిరంగ ప్రదేశాల్లో ఉరితీసి చంపాలని సుద్దాల వేద పండితులు వేపా నర్శింహ మూర్తి డిమాండ్ చేశారు. భారతదేశంలో ఎంతో శాంతిని సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే కొన్ని విదేశీ శక్తులు భారత్ పై పగతో రాజకీయంగా ఏం చేయలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ఘటనలతో భారత్ ఆత్మస్థైర్యం దెబ్బ తీయలేరని ప్రతి పౌరుడు పంజా బిగించి ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. రక్తపాతంతో రాజకీయాలను శాసించలేరని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారత్ లో ఉగ్రవాదుల పొరపాటును వెంటనే నిర్మూలించాలని ఉగ్రవాదులను గుర్తించి వారిని ఏరి పారేయాలని సూచించారు. భారత్ ఎంతో సమయంతో ప్రపంచంలోని ఒక గొప్ప శాంతి దేశంగా వర్ధిల్లుతుందని దీనిని దెబ్బతీయాలని కొన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నయని ఇలాంటి వారి ఆటలు కొనసాగనివ్వవద్దని పేర్కొన్నారు. ఉగ్రవాదుల చేతిలో హతమైన భారత ప్రజలు పర్యటకులు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.