ఘనంగా ఆదిలక్ష్మి చెంచు లక్ష్మీ సహిత నర్సింహస్వామి కల్యాణ మహోత్సవం.....

పెద్దపడిశాల గ్రామంలో ఘనంగా ఆదిలక్ష్మి చెంచు లక్ష్మీ సహిత నర్సింహస్వామి కల్యాణ మహోత్సవం.....అంగరంగ వైభవంగా జరిగిన కల్యాణ మహోత్సవం హాజరైన భక్తులు..



శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ అర్చకులు కృష్ణమోహనచార్యులు ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవ ఆగరుపద్ధతిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు. విశ్వకేసన ఆరాధన, పుణ్యహావాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవితాధారణం, మాంగళ్యాధారణ ఘనంగా కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు స్వామి వారి కల్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు సన్మానించి మాట్లాడుతూ ఆలయా అభివృద్ధికీ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో గోడిశాల నాగరాజు-మణిమాల, తోట రవి-పద్మ, డేగల శ్రీను-స్వర్ణలత, కందుకూరి చందు, గోలి చిన్న లక్ష్మయ్య-సువర్ణ, గోలి యాదగిరి-లక్ష్మీ, వారాల వెంకటేశ్వర్లు, కడారి శ్రీశైలం-రమా, రాగం శ్రీను-రజిత, గొట్టె వెంకటేష్-విజయా, బుర్ర గణేష్, మోత్కూరు నవీన్ చారి, నోముల భిక్షమయ్య, కడారి వెంకన్న, మామిడి నాగరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.