విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్ధిని విద్యార్దులు ట్రెక్కింగ్, ప్రకృతి పరిశీలన మరియు పరిరక్షణ యాత్ర....

ఏప్రిల్ 22 భూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా స్వామి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్ధిని విద్యార్దులు ట్రెక్కింగ్, ప్రకృతి పరిశీలన మరియు పరిరక్షణ యాత్ర....



ఈరోజు కూర్మమ్మ స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు ట్రెక్కింగ్ మరియు ప్రకృతి పరిశీలన నిమిత్తం జీవీఎంసీ 67వ వార్డు సాయిరాం నగర్ లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు ఆధ్వర్యంలో సాయిరాం నగర్, శంకర్ నగర్, పాత గాజువాక మరియు కొత్తగాజువాక, బీసీ రోడ్ జంక్షన్ మీదిగా జింక్ గేటు నుండి హిందుస్థాన్ జింకను ఆనుకుని ఉన్న కృష్ణానగర్ కొండపైన ట్రక్కింగ్ నిర్వహించడం జరిగింది. 



ప్రకృతి పరిశీలనకు బయలుదేరిన విద్యార్థులందరూ ముందుగా కొండకు ఆనుకొని ఉన్న హిందుస్థాన్ జింక్ కంపెనీ శివాలయంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఆ మహాశివునుని దర్శించుకునిన తర్వాత స్కౌట్ మాస్టర్ లక్ష్మణస్వామి మరియు గైడ్ కెప్టెన్ శ్రీమతి సూర్య కుమారి, స్కౌట్స్ గైడ్ రమేష్, పెట్రోల్ లీడర్ వరలక్ష్మి, మరియు అసిస్టెంట్ స్కౌట్స్ లీడర్ రేవంత్, గైడ్ అసిస్టెంట్ లీడర్ ఇందుమతి లను తోడ్కొని కొండపైన టెంట్ ఫిట్టింగ్, ఫ్లాగ్ ఫోల్ నిర్మాణం, మరియు విద్యార్థులు కొంత సమయం గడపడానికి తగిన స్థలాన్ని గుర్తించిన తర్వాత మిగతా స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులును కొండపైన కొంత సమయం ఉండటానికి అనువైన స్థలాని ఏర్పాటు చేశారు. 



ముందుగా కొండపైన ఉండే చెట్లకు తాళ్ళను చెట్టుకు చెట్టుకు కట్టి ప్రతి విద్యార్థి తను తీసుకువచ్చిన స్టేవ్ లు సపోర్టుతో కొండపైకి ఎక్కుతూ ట్రక్కింగ్ నిర్వహించారు. ముందుగా విద్యార్థులు ఉండటానికి మరియు వారితో పాటు తీసుకువచ్చిన బ్యాగులను భద్రపరచుకోవటానికి టెంట్ ను, ఫ్లాగ్ ఫోల్ నిర్మించుకోన్నారు. 



తర్వాత స్కౌట్ ట్రక్కింగ్ కు సంబంధించిన పద్ధతులను అనుసరించి విద్యార్థులందరూ ఉపాధ్యాయులు సహకారంతో కృష్ణానగర్ కొండపైన ఉండే వివిధ మొక్కలు, చెట్లు, వివిధ రకాల జీవరాసులను పరిశీలించుకుని, వారి వారి రికార్డులను రూపొందించారు. వారికి అర్థం కాని సమాచారంతో పాటు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రకృతి యొక్క గొప్పతనం వివరించారు. 



మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థులందరూ టెంట్ వద్దకు చేరుకుని వారు అప్పటికే తీసుకుని వచ్చిన ఆహార పదార్థాలను మరియు స్కూల్ మేనేజ్మెంట్ వారిచ్చిన మిఠాయిలను, శివాలయం వారు ఇచ్చే ఫలహారాలను భుజించారు. విద్యార్థులందరూ ఒంటి గంట సమయం తర్వాత కొండ దిగువకు చేరుకొని జింక్ శివాలయం పరిసర ప్రాంతాలలో వివిధ ప్రకృతి కి సంబంధించిన అంశాల పై చర్చలు, తో పాటు పరస్పరం ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోన్నారు.



స్కౌటింగ్ ట్రక్కింగ్ లేదా హైకింగ్ అనేది స్కౌట్ పద్ధతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది యువతకు అవగాహన కల్పించడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి, మరియు బహిరంగ ప్రదేశాల పట్ల ప్రశంసలను ప్రోత్సహించడానికి కీలకమైన భాగమని, స్కౌటింగ్ లో ట్రక్కింగ్ కార్యకలాపాలు ఆచరణాత్మక అనుభవం ద్వారా స్వావలంబన నాయకత్వం మరియు జట్టు కృషిని నిర్మించడానికి లక్ష్యంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని,



ప్రథమ చికిత్స నైపుణ్యాలను అవసరమయ్యే పరిస్థితులను తెలుసుకోవడానికి, పరిస్థితులకు అనుగుణంగా ఆశ్రమం నిర్మాణం, అగ్నిని ప్రారంభించడం, మరియు ఇతర మనుగడ పద్ధతుల గురించి నేర్చుకోవచ్చనీ హైకింగ్, ట్రక్కింగ్లు ద్వారా ఓర్పును మరియు శారీరక దృఢత్వమును పెంచుతాయనీ, సొంతంగా చర్యలకు బాధ్యత వహించడానికి, ఆరుబయట సమయం గడపడానికి మరియు శారీరక శ్రమలో పాల్గొనటానికి ట్రక్కింగ్ ఒక అద్భుతమైన మార్గమని ట్రక్కింగ్ గైడ్ విద్యార్ధులకు తెలిపారు. 



ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సింగిరెడ్డి లక్ష్మి, ఎస్ రూప లత, అచ్యుతన సుబ్బలక్ష్మి మరియు కుమార్ తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థుల ప్రకృతి పరిశీలన, పరిరక్షణ కోసం మేము చేసే బృహత్కర కార్యక్రమానికి ఎంతో సహోదయంగా సహకరించిన రాజాన మధు మాస్టర్ కి జింక్ శివాలయం పూజారి కి ముఖ్యంగా స్వామి విద్యానికేతన్ కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి కి మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు స్వామి విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి లక్ష్మణస్వామి తెలిపారు.