ఉగ్రవాద కుక్కలను కేంద్రం ఏరిపారేస్తుందని స్పష్ఠీకరణ...
జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు పంజా విసిరారనీ పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని ఎంతోమంది అమాయక పర్యాటకులు గాయపడ్డారని ఖబర్దార్ ఉగ్రవాదులరా అంటూ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యమగాని బాలు గౌడ్ హెచ్చరించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఉగ్రవాదుల దుశ్చర్యతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయనీ పేర్కొన్నారు. పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలోని ఒక పర్యాటక రిసార్టు వద్ద ఈ దాడి జరిగిందనీ ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుంటుందన్నారు. ఆలాంటి ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనిక తరహా దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి తెగించారని పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారని బాలు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద కుక్కలను ఏరివేస్తామని దీని వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. భారత్ శాంతిని కాంకాంక్షిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను ప్రేరేపించి శాంతికి భంగం వాటిల్లెల విచ్చర్ల పాల్పడుతుందని బాలు గౌడ్ అన్నారు. ఉగ్రవాదులను పక్క ఎరివేస్తామని కేంద్రం చూస్తూ ఊరుకోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉగ్రవాదులకు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. యావత్ భారతావని ఈ దుశ్చర్యను రాజకీయాలకు అతీతంగా ఖండించాలని భారతమాత సేవలు అందరూ ఏకమై ముక్తకంఠంతో పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండించాలని అన్నారు.