పీతల మూర్తివి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు -ఆరోపించిన డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్...
విశాఖపట్నం, ఏప్రిల్ 23: వార్డును కార్పొరేటర్ పీతల మూర్తి గాలికి వదిలేసి ఉదయం పూట రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు కుంభకోణాలు చేస్తున్నారని అందరి మీద ప్రెస్ మీట్లు పెడుతూ, సాయంత్రం వేళల్లో స్టార్ హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటున్నారని డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ ఆరోపించారు. బుధవారం ఉదయం నగరంలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీతల మూర్తి త్వరలో ప్రధాని, రాష్ట్రపతిపై కూడా ఆరోపిస్తూ ప్రెస్ మీట్ లు పెడతారేమో అని ఎద్దేవా చేశారు. 2007లో తాను కార్పొరేటర్ గా 1000 ఓట్లతో గెలిచానని, తర్వాత వైసీపీలో మరలా కార్పొరేటర్ గా గెలిచి డిప్యూటీ మేయర్ అయినట్టు తెలిపారు. బికారిగా తిరుగుతుంటే మూర్తిని యూత్ కాంగ్రెస్ లో పెట్టించింది తానే అని, నీతి నిజాయితీ అంటాడని ఒకే వార్డ్ లో పోటీ చేద్దాం, ఎవరి వైపు ప్రజల ఓటు పడుతుందో చూద్దామా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం భూములు అన్ని ఆక్రమణలు చేశానని ఆరోపించాడని, దానిమీద విచారణ చేయమని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించానన్నారు. జీవీఎంసీ మూడు మతాల శ్మశానం చెందిన స్థలం అభివృద్ధి చేశామని తెలిపారు.
మహేష్ అనే వ్యక్తి దగ్గర 5 లక్షలు విలువ చేసే స్థలం రూ. రూ.50 లక్షలు తీసుకున్నానని ఆధారాలు లేకుండా మూర్తి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆనందపురంలో వాటర్ ప్లాంట్ చెల్లి పేరు మీద పెట్టి అదే స్టలం మూర్తి కబ్జా చేశాడని ఆరోపించారు. స్పా మసాజ్, యోగ సెంటర్ లకి మంకి కాప్ వేసుకొని మూర్తి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు.
వేల కోట్ల టిటిఆర్ ల గురించి మాట్లాడి హోటల్స్ లో లాలూచి కుదుర్చుకుంటారని ఆరోపించారు. నా పాస్పోర్ట్ సీజ్ అని చెప్తున్నాడని, కొన్ని రోజుల క్రితమే అమెరికాకి వెళ్లి వచ్చానని, త్వరలో తానా సభలకు వెళ్తున్నానన్నారు. తాను 150 సార్లు ఢిల్లీ పెళ్లి వచ్చానని అబద్దం మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం మహిళా డాక్టర్ సాలరీ కార్డు జేబులో పెట్టుకొని జల్సాలు చేస్తున్నాడని, ప్రతి ప్రాంతంలో ఒక్కొక ఇంటిని మెయింటైన్ చేయడం లేదా అని ప్రశ్నించారు. ఎండాడలోని స్కై టవర్స్ బిల్డర్స్ ని భయబ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకోలేదా అని మూర్తిని అడిగారు. చెప్పులు లేకుండా డ్రైవర్ ఉద్యోగం కోసం తిరిగానని తనని అంటున్నాడని, మోడీ లాంటి మహా నాయకుడు చాయ్ అమ్ముకొని వచ్చారని, అందులో తప్పేముందన్నారు.
తన వార్డులోనే ఓ మహిళ దగ్గర 90 తులాల బంగారం, 30 లక్షలు దోచున్నాడని కమీషనర్ కి కూడా ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆనందపురం మండలం గిడిజాల గ్రామనికి చెందిన ప్రాంతం సర్వే నెం. 332/1 1.24 సెంట్లు, 332/2 లో సుమారు 7.03 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసాననే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ భూములను ఆక్రమించినట్టు రుజువు ఐతే, వాటిపై తగు విచారణ జరిపించి, ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు. వార్డులోని చిరు వ్యాపారులను సామాన్యులను నీడ లేకుండా చేస్తున్న పీతల మూర్తికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, వైసీపీ నాయకులు గోలగాని శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్, ఒమ్మి చిన్నరావు, కోరుకొండ స్వాతి, శశికళ, మొల్లి అప్పారావు, మువ్వల సురేష్ పాల్గొన్నారు.