ఇష్టనుసారంగా మరీ ఇంత దారుణంగా ఓవర్ లోడ్లు చేసుకొని రోడ్లంతా పాడు చేస్తూ

బూడిద లారీలను అడ్డుకున్న గ్రామస్తులు... 



అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పెదముషిడివాడ పంచాయతీ, గండివానిపాలెంలో పరిమితికి మించి రోడ్లు పై వెళుతున్న బూడిద లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. 



ఈ సందర్భంగా నందవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ మార్గం గుండా సింహాద్రి ఎన్టిపిసి హిందుజ పవర్ ప్లాంట్ నుంచి బూడిద ని పరిమితికి మించి వందలాది లారీలు యాష్ ను లోడ్ చేసుకొని ఈ మార్గం తిరుగుతున్నాయని హెవీ వెహికల్స్ అధిక లోడు వేయడమే కాకుండా పరదాలు పూర్తిగా కప్ప కుండా వేగంగా వెళ్ళటం వల్ల బూడిద రోడ్ల గుండా వెదజల్లుతూ తిరుగుతున్న లారీల వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. 



ఈ బూడిద వల్ల గొంతు,కళ్ళు, మంటలు రావడంతో హాస్పిటల్ గురవుతున్నారన్ని అన్నారు. రోడ్డు ప్రక్కన బ్రతుకుతెరువు కోసం పెట్టుకున్న టీ, టిఫిన్, భోజన హోటల్స్,కి ఈ యాష్ పౌడర్ వల్ల కస్టమర్లు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అడ్డు అదుపు లేకుండా ఇష్టనుసారంగా మరీ ఇంత దారుణంగా ఓవర్ లోడ్లు చేసుకొని రోడ్లంతా పాడు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ బూడిద లారీలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.