ఉగ్రదాడి మృతులకు సుద్దాల గ్రామంలో ఉపాధి పథకం పనులు చేస్తుండగా 2 నిమిషాలు సంతాప మౌనం పాటించిన కూలీలు...
ఉగ్రవాదులకు సుద్దాల గ్రామ హిందూ సంఘాల వార్నింగ్...
ఉగ్రవాదంపై ప్రతీకారం తప్పదు త్వరలో గట్టి జవాబిస్తాం..
పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సుద్దాల గ్రామ అడవిలో మిన్నంటిన నినాదాలు...
ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేస్తోందని సుద్దాల గ్రామ హిందూ సంఘాల వార్నింగ్ అన్నారు. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ పత్రిక ప్రకటన విడుదల చేశారు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందనీ ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.ఈ క్లిష్ట సమయంలో ఐక్యంగా ఉందమని ఇందు ఐక్యత సంఘాల నాయకులు ఎలా లింగం అన్నారు. మన భారత ఐక్యతను ఏ ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలి. సమష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం కలిసికట్టుగా ఉందాం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అని సుద్దాల ఇందు సంఘము నాయకులు ఆవేదనతో తెలిపారు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ చనిపోయిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదులను అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు సుద్దాల గ్రామ హిందూ సంఘాలు ఒక తాటి పైకి వచ్చి ప్రదర్శన చేపట్టి పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పహిల్గమ్ ఘటనలో ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఎలా లింగం మాట్లాడుతూ ఈ దారుణానికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన గుణపాఠం చెబుతుందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న శక్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వారిని ఉపేక్షించేది లేదని, త్వరలోనే భారత్ గట్టి జవాబిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడే వారికి త్వరలో గట్టి సమాధానమిస్తాం అని చెప్పారు. ఉగ్రవాదుల వెనుక ఉండి కుట్రలు నిడిపిస్తున్న వారిని సైతం టార్గెట్ చేస్తాం అని అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని అన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. భారత్ అతి పురాతన దేశమని, ఉగ్రవాదానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావంగా అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు ఎలా లింగం,ఎగుమటీ వేణు గోపాల్ రెడ్డి, యమగాని యాదయ్య పెద్ద గౌడ్, అండెం మోహన్ రెడ్డి, యమగాని నర్సయ్య గౌడ్, బత్తిని రాజు గౌడ్, అండెం నర్సిరెడ్డి, తుంగ నరేష్, బద్ధుల శ్రీనివాస్, రమేష్, బిసు లక్ష్మీ, యాదగిరి, పెద్ద ఎత్తున హాజరై కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు.