నాలుగు కిలోమీటర్ల తారోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

కూటమి ప్రభుత్వం రాకతో ఈ గ్రామాలకు రహదారి మోక్షం.....గ్రామస్తుల కళ్ళలో ఆనందం...



అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, దామనపల్లి పంచాయతీ, లింగవరం నుండి పిప్పలదొడ్డి వరకు, పిప్పల్ దొడ్డి నుండి గొడుగుమాడు వరకు నాలుగు కిలోమీటర్ల తారోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్థానిక సర్పంచ్ కుందేరి.రామకృష్ణ, స్థానిక ఎంపీటీసీ కొర్ర.భీమారావు,కూటమి నాయకులు బిజెపి అరకు పార్లమెంట్ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుక్కేరి.ప్రభాకరరావు, మాజీ ఎంపీపీ టిడిపి నాయకులు సాగిన.బాలరాజు, కొబ్బరికాయ కొట్టి తారోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ తారోడ్డు గతం2018లో ఈ గ్రామానికి రహదారి శాంక్షన్ అయినప్పటికీ అప్పటి కాంట్రాక్టర్ గ్రావిటీ రోడ్డు వేసి వదిలేసారు, అది రద్దు అయ్యింది. అప్పటినుండి 2025ఇప్పటివరకు ఈ గ్రామస్తులకు రహదారి లేక ఎన్నో ప్రమాదలకు గురై ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి అనేక ఇబ్బందులు పడ్డారు.



 ప్రస్తుత కేంద్ర బీజేపీ ఎన్.డి.ఏ.ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రోడ్డు నిర్మాణాలు ప్రతి మారుమూల ప్రాంతాలకు మూడు నెలల్లోపు పూర్తి చేయాలన్న ఆదేశాలు మేరకు ఈ గ్రామానికి ఇప్పుడు తారోడ్డు శాంక్షన్ అవ్వటం రహదారి మోక్షం కలుగుతుంది. తారోడ్డు నిర్మాణం చేస్తున్నందుకు స్థానిక గ్రామస్తులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పిప్పల దొడ్డి, మరియు గొడుగుమామిడి గ్రామస్తులు పాల్గొన్నారు,