భారీ బహిరంగ సభకు ఓరుగల్లు పిలుస్తుంది రా కదలిరా !

చలో బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ఓరుగల్లు పిలుస్తుంది రా కదలిరా !

బిఆర్ఎస్ రజితోత్సవ సభను విజయవంతం చేయండి

వరంగల్ సభకు ఉత్సాహంగా కదలాలి మెండుగా ఓరుగల్లు సభకు దండిగా.

సుద్దాల బి ఆర్ యెస్ పార్టీ గ్రామాషాక అధ్యక్షుడు కొండపల్లి మొగిలాల్



ఈ సందర్భంగా సుద్దాల బి ఆర్ యెస్ పార్టీ గ్రామాషాక అధ్యక్షుడు కొండపల్లి మొగిలాల్ మాట్లాడుతూ ఈ నెల 27న ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో జరుగు బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని సుద్దాల బి ఆర్ యెస్ పార్టీ గ్రామాషాక అధ్యక్షుడు కొండపల్లి మొగిలాల్ పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, అదేశాల ప్రకారం వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో బయలుదేరాలని కొండపల్లి మోగిలాల్ అన్నారు. ఏప్రిల్ 27 సభ విజయవంతానికి పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ సభ తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబోతోందని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అడగని పథకాలు సైతం ఆచరణలో అమలు చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. వరంగల్ సభకు వాహనాల ఏర్పాటు, సదుపాయాలు ఉంటాయని సమీక్షించారు. ఆ రోజు గ్రామ గ్రామాన పార్టీ జెండాలు ఆవిష్కరించుకుని, వరంగల్ బయలుదేరాలని సూచించారు వరంగల్ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు రజితోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.