కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని అమలాపురం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించిన న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు.
పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు విడనాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఇటువంటి దు శ్చర్యలను భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరిన సాయి, ప్రధాన కార్యదర్శి నందికి శ్రీను, అడపా ప్రసాద్, నందెపు చిన వెంకటేశ్వరరావు, కన్నీడి వెంకటరమణ,బడుగు భాస్కర్ జోగేష్, మట్టపర్తి అచ్యుతానద్, వై. సత్యనారాయణ, భాస్కర శాస్త్రి, మరియు వివిధ న్యాయవాదులు పాల్గొని అన్నారు. భారతదేశమంత ఒక్కటే భారతీయులంతా సమానమని, పాకిస్తాన్ ని ఎదుర్కొనే శక్తి భారదేశానికి ఉందని వారు మాట్లాడి ఉన్నారు.