విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ.
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్, సాయి ఉదయ మాట్లాడుతూ క్లస్టర్ యూనివర్సిటీ కింద ఉన్న సిల్వర్ జూబ్లీ ,కె.వి.ఆర్ మహిళ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల( ఫర్ మెన్ ) కాలేజీలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి ఇంటెన్షిప్ పరీక్ష ఫీజు అని చెప్పి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. డిగ్రీ మూడవ సంవత్సరంలో ఆరవ సెమిస్టర్ కి రాతపూర్వకమైనటువంటి పరీక్ష ఏమి ఉండదు కేవలం ఇంటెన్షిప్ మాత్రమే ఉంటుంది. ఇంటర్ షిప్ సంబంధించి ఎటువంటి రాతపూర్వకమైనటువంటి పరీక్ష ఉండదు అయితే క్లస్టర్ యూనివర్సిటీ కింద ఉన్న మూడు కాలేజీలకి సర్కులర్ జారీ చేసి విద్యార్థుల దగ్గర నుంచి 700 పైగా డబ్బులు వసూలు చేస్తున్నారు. విద్యార్థులు వెళ్లి మేము పరీక్షలు రాయడం లేదు కదా డబ్బులు ఎందుకు కట్టాలని రిజిస్టర్ ని అడిగితే ఎటువంటి సమాధానం చెప్పకుండా. రిజిస్టర్ గారు క్లస్టర్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం మేము విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. రిజిస్టర్ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చుకొని క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి. కానీ ప్రభుత్వాన్ని అడగలేక పేద విద్యార్థుల దగ్గర నుంచి అధిక మొత్తంలో ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు. అదేవిధంగా పరీక్ష ఫీజు కట్టకపోతే మీకు సర్టిఫికెట్లు ఇవ్వము ఎవరికి చెప్పుకుంటారో చెప్పకండి అన్నట్టు రిజిస్టర్ మాట్లాడుతున్నారు.
మూడు కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు భయాందోళన చెంది ఫీజు కట్టే పరిస్థితి క్లస్టర్ యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులపై ఒత్తిడి గురి చేస్తున్నారు. విద్యార్థుల దగ్గర్నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగే విద్యార్థులకు ఇవ్వకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని తెలియజేస్తున్నాము. పరిస్థితులు చేయి జారితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అదేవిధంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థుల న్యాయమైన సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విద్యార్థుల పక్షాన ఉండి పోరాటం కొనసాగిస్తామని క్లస్టర్ యూనివర్సిటీకి ఇతర సిబ్బందికి హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర సహాయ కార్యదర్శి పృథ్వి నగర కమిటీ సభ్యులు హరి, మురళి పాల్గొన్నారు.