జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో గల గరిమెళ్ళ సత్యనారాయణ B.Ed కాలేజీ నందు శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన శక్తి టీం జిల్లా ఇన్ చార్జ్ నోడల్ ఆఫీసర్ డి.ఎస్.పి (మహిళా పోలీస్ స్టేషన్) కె.వి. సత్యనారాయణ.
ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ... మహిళలు మరియు బాలికలపై జరిగే లైంగిక దాడులపై వారిలో విసృత అవగాహన కల్పించారు. అదేవిధంగా మహిళలకు self-defence టెక్నిక్స్ గురించి, సైబర్ నేరాల గురించి, సోషల్ మీడియా యాప్స్ యొక్క నష్టాల గురించి, POSH చట్టం మరియు శక్తి యాప్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించి, మహిళలు అందరూ కూడా శక్తి యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా, ఏ సమయంలో నైనా శక్తి యాప్ ద్వారా పోలీస్ ల సహాయం కోరవచ్చు అని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ గారితో పాటుగా SK. అమీనా బేగం (WSI Mahila PS) గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
సుమారు 100 మంది మహిళా విద్యార్దులు మరియు ఉపాధ్యాయులు హాజరయినారు.