వైభవంగా సీతారాముల కళ్యాణం...సాలాపు చిన్న, గల్లా శ్రీనివాస దంపతులు
సింధియా: శ్రీరామ నవమి పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోనే మొట్టమొదటి నౌక నిర్మాణ కేంద్రం, సింధియా షిప్ యార్డ్ పాత కాలనీలోని ఉమా రామ లింగేశ్వరాలయంలో సీతారాముని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు సాలాపుచిన్న దంపతులు హాజరయ్యారు. అర్చకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దంపతులు శ్రీతరామ కళ్యాణోత్సవం, అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్న సమారాధన నిర్వహించారు. కాలనీ పూర్వ నిర్వాసితులు చాలా రోజుల తర్వాత కాలనీలో కలిసిపోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
పాత కాలనీలో... షిఫ్ట్ యార్డ్ పాత కాలనీలో ఏళ్ళ చరిత్ర గల బాల భక్త సమాజం మందిరంలో చాలా కాలానికి సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించారు. వైభవంగా జరిగేందుకు కాలనీ పూర్వ నివాసులు తరలిరావడం ఒకరినొకరు పలకరించుకుని ఆప్యాయతను చాటుకున్నారు.