జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీల నిర్వహణ



జిల్లా ఎస్పీ  డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీల నిర్వహణ.



జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు శనివారం అనగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక శక్తులను, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకుగాను పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఎయిర్ పోర్ట్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ వాళ్లు, లాడ్జిలు, జనసంచార ప్రదేశాలలో తనిఖీలు మరియు ముఖ్య ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనలా తనిఖీలు నిర్వహించారు.



ఈ సందర్భంగా... జిల్లా అంతట పోలీసులు ప్రతి ప్రదేశంను మరియు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు.



ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సి.సి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పోలీసు అధికారులు సూచించారు.