మొగల్తూరు: మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో శుక్రవారం బిల్డింగ్ స్లాబ్ సెంట్రింగ్ ఊడతీస్తుండగా ప్రమాదవశాత్తు యువకుడు పైనుంచి కింద పడిపోయారు. ఆ సమయంలో అతని కాలు తొడ భాగంలో ఇనుప ఊస చొచ్చుకుని పోయింది. నరసాపురం మండలం కొండవీటి కొడపకి చెందిన చామకూరి వెంకట గణేశ్ పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సకాలంలో 108 సిబ్బంది ఊసలు కట్ చేసి వైద్యం నిమిత్తం పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.