పెరగనున్న విమాన టికెట్ ధరలు?

 పాక్ నిర్ణయం.. పెరగనున్న విమాన టికెట్ ధరలు?



పాక్ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు 8-12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి యూరప్, నార్త్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికులపై ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ సమయం 2 నుంచి 3గంటల వరకూ పెరగనుంది.